ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం అమరావతిలో పర్యటించారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.