తాడికొండలో శ్రీ రాముల వారి దేవాలయంలో వైఎస్సార్సీపీ పూజలు

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9:30 గంటలకు తాడికొండలోని శ్రీ రాముల వారి దేవాలయంలో వైఎస్సార్సీపీ పూజా కార్యక్రమాలు నిర్వహించనుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తూ, దేవాలయం వెలుపల మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయనున్నారు. తిరుమల లడ్డూ అంశంపై చంద్రబాబు చేసిన అపచారాలకు పరిహారంగా ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్