తెనాలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్: రూ.7.73 లక్షల చెక్కుల పంపిణీ

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి - LOC ద్వారా రూ.7,73,516 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను శుక్రవారం అందజేశారు. టిడిపి ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చొరవతో కళ్ళగుంట్ల శ్రీలక్ష్మి, రేపల్లె నాగేంద్రం, ఏమినేని శ్రీహర్ష, పఠాన్ వహీదా, గంగాధర సాయి శివరావులకు ఈ సహాయం మంజూరైంది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ ఆలపాటికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్‌తో పాటు పలువురు నాయకులు చెక్కులను అందజేశారు.

సంబంధిత పోస్ట్