కూటమి ప్రభుత్వం రెండేళ్లలో తెనాలి అభివృద్ధికి పునాదులు: మంత్రి నాదెండ్ల

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలో తెనాలి అభివృద్ధికి బలమైన పునాదులు వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరులోని తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వైసీపీ అభ్యర్థి శివకుమార్ ఓటర్ ను కొట్టిన ఘటనను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలను ప్రజలు తిరస్కరించారని అన్నారు. రెండేళ్ల పాలనకు సహకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బిజెపి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్