రండి బాబు రండి రూ. 5 లక్షలకే 100 గ్రాముల బంగారం

తక్కువ ధరకు 100 గ్రాముల బంగారం ఇస్తామని నమ్మించి, ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన తెనాలి మండలంలో వెలుగుచూసింది. బాధితుడు రూ. 5 లక్షలు చెల్లించి బంగారం పేరిట పూసలు కొనుగోలు చేయగా, అవి రాగికి బంగారపు పూత వేసిన నకిలీవని కరిగించే సమయంలో బయటపడింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ప్రయాణించిన కారును పోలీసులు గుర్తించారు. బాపట్ల జిల్లా స్టువర్ట్‌పురానికి చెందిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్