షార్ట్ సర్క్యూట్ తో పంట దగ్ధం

కొల్లిపర మండలం చక్రాయపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొలాల్లో మంటలు చెలరేగి, సుమారు 2.5 ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్లను సరిచేయాలని గ్రామస్థులు విద్యుత్ సిబ్బందిని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్