తెనాలి మండలం కొలకలూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దీనిపై ఆలయ పూజారి మాట్లాడుతూ మంగళవారం అర్ధరాత్రి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు హుండీని ధ్వంసం చేసి సుమారు రూ. 20 వేల నగదును అపహరించుకుపోయినట్లు తెలిపారు. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసే విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.