కొల్లిపర మండలంలోని అన్ని రేషన్ దుకాణాల్లో ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని డివిజనల్ సివిల్ సప్లై అధికారి జాన్ గురువారం తెలిపారు. రేషన్ తీసుకునే వారు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా మండల తహశీల్దారిని సంప్రదించాలన్నారు.