తెనాలి పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మారీసుపేటలో ఓ భారీ చెట్టుపై పిడుగు పడి విరిగి నేలకూలింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.