తెనాలిలోని మారీసుపేటలో ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నూతన స్పెషల్ మున్సిపల్ ఉర్దూ స్కూల్ ను శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో స్వయంగా మాట్లాడుతూ.. పాఠశాలలో వారికి ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.