కొల్లిపర మండల పరిధిలో గల అన్నవరం, గౌడ్పాలెం, తూములూరు, దావులూరు, పాత బొమ్మవానిపాలెం, అలాగే వల్లభాపురం, అత్తలూరు, దంతలూరు, అత్తోట గ్రామాల్లో విద్యుత్ పనుల నిర్వహణ నేపథ్యంలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ నిలిపివేస్తామని ఏఈ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించవలసిందిగా కోరారు.