తెనాలి మారీసుపేటలోని రేపల్లె గేటు ప్రాంతంలో అద్దె ఇంటి వివాదం శనివారం రాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. ఇల్లు ఖాళీ చేసే విషయంలో యజమానురాలు ముక్కామల స్వాతి, అద్దెదారు షేక్ సుభాని మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. గతంలోనే సుభాని తనను బెదిరిస్తున్నారని స్వాతి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాజా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు.