రైలు నుంచి జారి పడి తీవ్రగాయాలు

దుగ్గిరాల మండలం మోరంపూడి - చిలువూరు మధ్య రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రైల్ గేటు నుంచి కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతన్ని వాహనం వరకూ మోసుకెళ్లి, తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్