స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) కేంద్ర బృందం మంగళవారం తెనాలి పట్టణంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించింది. ఎస్‌బీఎం డైరెక్టర్ సురభి మాలిక్, కమిషనర్ అప్పలనాయుడుతో కలిసి సుల్తానాబాద్ ప్రాంతంలోని హోం కంపోస్టింగ్ యూనిట్లు, త్రిబుల్ ఆర్ సెంటర్, కంపోస్ట్ యార్డును తనిఖీ చేశారు. ఎస్‌టీపీ ప్లాంట్, ఎంఆర్ఎఫ్ కేంద్రాల నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య చర్యలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. నగర పరిశుభ్రతకు సంబంధించి అధికారులతో పలు అంశాలపై చర్చించింది.