తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొలకలూరులో ఆరు, కోపల్లెలో రెండు, సిరిపురం, అన్నవరం, పట్టణంలోని 14, 31, 38 వార్డుల్లో ఒక్కొక్క ఆయాలు, కోపల్లెలోని కార్యకర్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెనాలి ప్రాజెక్టు సీడీపీవో విజయగౌరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఆసక్తిగల అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రం, వార్డు, గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలని ఆమె సూచించారు.