తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న అప్రెంటిస్ మేళా జరగనుంది ప్రిన్సిపల్ చిన్న వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 14వ తారీకు ఉదయం 10. 30 గంటలకు మేళాలో ప్రైవేట్ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి అని ఆయన అన్నారు. అర్హత పొందిన విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మేళాకు హాజరయ్యే ఐటీఐ పూర్తి చేసిన యువత బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.