తెనాలి మండలం గుడివాడలోని మద్రాస్ కాలువలో సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎడమ చేతికి ఆరవ వేలు ఉందని రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.