తెనాలి: నగల మాయంపై ఫిర్యాదు

ఐతానగర్లో ఇంట్లో బీరువాలోని బంగారు నగలు మాయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రయివేటు ఉద్యోగులైన దంపతులు ఊరెళ్లి నాలుగు రోజుల కిందట తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి తాళం, బీరువా తాళం చెక్కుచెదరకపోయినా, బీరువాలోని రెండు బంగారు గాజులు, ఒక జత చెవి దిద్దులు మాయం అవ్వడాన్ని గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు ఇంటి, బీరువా తాళాలు తీసి నగలు దొంగిలించి, తిరిగి యథావిధిగా ఉంచేయడంతో తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్