తెనాలి: 3న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన

ఈనెల 3న తెనాలి కోగంటి మున్సిపల్ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డీపీఎం డాక్టర్ శివరామప్రసాద్, ఇతర అధికారులు శనివారం పరిశీలించి, స్థానిక అధికారులు, సిబ్బందితో చర్చించారు.

సంబంధిత పోస్ట్