తెనాలి: భూసేకరణ చేయడం అన్యాయం

గుంటూరు తూర్పు వైసీపీ ఇన్‌చార్జ్ నూరి ఫాతిమా, అమరావతి ప్రాంతంలో ముస్లిం ధార్మిక సంస్థ అంజుమనే ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాల భూమిని ప్రభుత్వం భూసేకరణ చేయడం అన్యాయమని విమర్శించారు. తెనాలిలో మైనార్టీ సంఘాలతో కలిసి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. చినకాకానిలోని ఈ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్