ఆయేషామీరా కేసులో సీబీఐ శుక్రవారం మెమో దాఖలు చేసింది. విజయవాడలోని సీబీఐ కోర్టులో అదనపు ఎస్పీ ఈ మెమోను దాఖలు చేశారు. నిరుడు జూన్ 20న తుది నివేదిక (ఛార్జిషీట్) దాఖలు చేశామని, దాని ప్రతిని సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించామని సీబీఐ తెలిపింది. ఆయేషామీరా తల్లిదండ్రులు దీనిపై ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయలేదని పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సీబీఐ కోరింది.