తెనాలిలోని బాలాజీరావుపేట, మారీసుపేట ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో రోడ్ల పైన మురికి నీరు నిల్వ ఉండటం, కాలువల్లో చెత్తాచెదారం పేర్కొనడంతో అధికారులు మరియు సిబ్బంది పనితీరుపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని సాయంత్రం 4 గంటలకు వచ్చి తిరిగి వీటిని చూస్తారని అప్పటికీ పారిశుధ్య పనులు మెరుగుపడాలి అన్నారు.