తెనాలికి చెందిన చిత్రకారుడు పణిదెపు వెంకటకృష్ణ (కృష్ణశ్రీ), ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన తల్లిదండ్రులైన నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ పేర్లను ఉపయోగిస్తూ ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. పెదరావూరు జెడ్పీ ఉన్నత పాఠశాల చిత్రకళోపాధ్యాయుడైన కృష్ణశ్రీ గీసిన ఈ అద్భుతమైన చిత్రం ప్రస్తుతం పలువురిని విశేషంగా ఆకట్టుకుంటోంది.