తెనాలిలోని జనసేన క్యాంప్ కార్యాలయంలో గురువారం నాడు మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన జగన్ పర్యటన పైన నాదెండ్ల మనోహర్ అనేక విమర్శలు చేశారు. మరోపక్క 30 వేల మంది రైతుల ఖాతాలో 650 కోట్ల రూపాయలు దాన్యం కొనుగోలు నిధులు జమ చేసినట్లు తెలిపారు. డబ్బు జమ చేయడంలో ఆలస్యమైనందుకు రైతులు పెద్ద మనసుతో క్షమించాలని ఆయన కోరారు.