తెనాలి నియోజకవర్గంలోని వైకుంటపురం దేవస్థానంకు వెళ్లే ప్రధాన రహదారిపై రేపల్లె నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ సైతం స్తంభించిపోయింది. దీనిపై డ్రైవర్ను అడగ్గా బస్సు జాయింట్ ఊడిపోయిందని తెలిపారు. వెంటనే ప్రయాణికులను వేరొక బస్సులోకి ఎక్కించి ప్రయాణికుల గమ్మేస్తారాలకు చేర్చారు. ప్రయాణమధ్యలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు సైతం అసహనం వ్యక్తం చేశారు.