తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని, సేవిస్తున్న ముగ్గురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పి బి. జనార్దనరావు ఈ వివరాలు వెల్లడించారు. గ్రామ శివారులోని చిన్న మాలపల్లి ఎన్టీఆర్ కాలనీ వద్ద ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.