దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్‌చంద్ర జయంతి సందర్భంగా ఆదివారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాలు జరగనున్నాయి. చెంచుపేటలోని విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం గౌతమ్ గ్రాండ్లో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన వెబ్‌సైట్, యువతకు ఉపయోగపడే యాప్‌లను ఆవిష్కరించనున్నారు. పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహక ప్రతినిధులు తెలిపారు.