గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నలువైపులా భారీగా వాహనాల తనిఖీలను గురువారం నాడు తెనాలి పోలీసులు నిర్వహించారు. తెనాలి మొత్తంలో 7 పాయింట్లలో చేపట్టిన తనిఖీలలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైసెన్సులు, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను తీసి చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.