సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో చోరీ.. 85 కిలోల ఇత్తడి సామగ్రి మాయం

తెనాలి సమీపంలోని ఎరుకలపూడి శ్రీ బాల సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శుక్రవారం భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని సుమారు 85 కిలోల ఇత్తడి, రాగి సామగ్రిని అపహరించారు. గంగాళం, గుండిగ, దబర, రాగి కలశం, చెంబులు వంటి వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్