తెనాలిలో ఇటీవల జరిగిన హాఫ్‌పేట చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ‘ఆర్టీజీఎస్ ఏఐ సీసీటీవీ 360’ యాప్ సహకారంతో ఖమ్మం జిల్లాకు చెందిన బండి గోపిని శనివారం అరెస్ట్ చేశారు. ఈ నెల 9న ఓ ఇంట్లో రూ. 25 వేల నగదు అపహరించి కారులో పరారైన నిందితుడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. కారు వివరాలను యాప్‌లో నమోదు చేయగా, నందివెలుగు జంక్షన్ వద్ద వాహనం కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 5 వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.