తెనాలి టిడ్కో ఇళ్ల వద్ద దొంగల హల్‌చల్

తెనాలిలోని టిడ్కో గృహాల ప్రాంతంలో బుధవారం రాత్రి దొంగలు కలకలం సృష్టించారు. చోరీకి ప్రయత్నిస్తున్న ఇద్దరు అనుమానితులను స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు వారికి దేహశుద్ధి చేసి, తెనాలి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్