చోరీ కేసులో ఇద్దరికి 6 నెలల జైలు

తెనాలిలోని శ్రీ పార్థసారథి మెటల్ ఇండస్ట్రీస్‌లో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గుంటూరుకు చెందిన మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్‌వలీలను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నగదుతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువుకావడంతో తెనాలి రెండో అదనపు సివిల్ జడ్జి ఇద్దరికీ చెరో రూ. 1, 000 జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్