కొల్లిపర ఎస్సై ఎన్.సి.ప్రసాద్ శనివారం నుంచి ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో యువత బెట్టింగ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు బెట్టింగ్కు ఉసిగొలుపుతుంటారని, దీనికి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని, ఎక్కువసార్లు నష్టమే ఎదురవుతుందని ఆయన అన్నారు. క్రికెట్ మ్యాచ్లను వినోదం కోసం మాత్రమే చూడాలని, బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112కు లేదా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన సూచించారు.