ఏపీ సమగ్రాభివృద్ధికి మూడు ప్రాంతీయ ఆర్థిక జోన్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి లక్ష్యంతో సీఎం చంద్రబాబు కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని మూడు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఈ జోన్లకు కేంద్రాలుగా ఉంటాయి. ప్రతి జోన్‌కు ఒక స్వతంత్ర వ్యవస్థ, సీనియర్ ఐఏఎస్ అధికారి CEOగా ఉంటారు. విశాఖ జోన్‌లో పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం; అమరావతి జోన్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార శుద్ధి, లాజిస్టిక్స్; రాయలసీమ జోన్‌లో పునరుత్పాదక శక్తి, మైనింగ్, ఉద్యానవన పంటలు, ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి సారిస్తారు. ఈ విధానం రాష్ట్ర GSDP వృద్ధి లక్ష్యం 15% సాధించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్