చిలుమూరు ఆలయ అభివృద్ధికి 73 లక్షల నిధులు కేటాయింపు

చిలుమూరు గ్రామంలోని ఉభయ రామలింగేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు ప్రభుత్వం 73 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. సోమవారం కొల్లూరు మండలం టిడిపి కన్వీనర్ మైనేని మురళీకృష్ణ నిధుల విడుదల పత్రాలను చిలుమూరు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త హరి దుర్గా నాగేశ్వరరావుకు అందజేశారు. రాబోయే కృష్ణ పుష్కరాల అభివృద్ధి పనులకు రెండు కోట్ల 93 లక్షల రూపాయల ఎస్టిమేషన్ పంపగా మొదటి విడత 73 లక్షలు నిధులు మంజూరైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్