వేమూరు మండలంలో 90 శాతం పల్స్ పోలియో డాక్టర్ సౌమ్య

ఆదివారం వేమూరు మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. మండల వైద్యాధికారులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ యామిని దివ్య తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. నవజాత శిశువుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించారు. మండలంలో మొత్తం 3256 మంది పిల్లలకు గాను 3154 మందికి చుక్కలు వేశారు.

సంబంధిత పోస్ట్