కొల్లూరు మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన వాగోలు శ్రీవిద్యను వేధించిన ఎడ్ల సురేష్ కు పోక్సో స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 1500 జరిమానా విధించింది. పోలీసులు ఫోక్సో కేసుగా నమోదు చేసి చార్జీ దాఖలు చేయగా, స్పెషల్ కోర్టు జడ్జి మద్దుల ఇందిరా ప్రియదర్శిని ఈ తీర్పు వెలువరించారు. కేసును స్పెషల్ పీపీ వలివేటి రాఘవయ్య, ఎస్సై కోటేశ్వరరావు పర్యవేక్షించారు.