భట్టిప్రోలు. దత్తాత్రేయ స్వామి గురు పౌర్ణమి వేడుకలు

భట్టిప్రోలు లోని సాయిబాబా మందిరంలో శ్రీ సాయినాథ దత్తాత్రేయ స్వామి వారి గురు పౌర్ణమి వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుండి భట్టిప్రోలు, అద్దేపల్లి గ్రామాలలో స్వామివారి భక్తులు భిక్షాటన కార్యక్రమాన్ని , శ్రీ సాయినామ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక వాహనంపై అలంకరించి వాహనం ముందు భాగాన భక్తులు మహిళలు జోల పట్టి ఇంటింటికి తిరిగి బిక్షాటన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్