భట్టిప్రోలు లో సోమవారం అన్న క్యాంటీన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజల ఆకలిని నివారించేందుకు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టాడని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేసిందని ఆయన విమర్శించారు.