చీరాల శ్రీరామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో వేటపాలెం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులకు 'వివేకానంద జీవితం - సందేశం' పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. బుధవారం 'క్రియేటివ్ చిల్డ్రన్స్ క్లబ్' నిర్వాహకులు యు. వేణుగోపాల్ వ్యక్తిత్వ వికాస ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెచ్ఎం డి. సరోజిని, సమితి సెక్రటరి విఎస్ఎన్ మూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు విజ్ఞానాన్ని, స్ఫూర్తిని అందించింది.