శనివారం వేమూరు గ్రామంలోని కల్యాణ మండపంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ శిక్షణ అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ప్రతి కార్యకర్త ఓటర్ నమోదు నుంచి ఓటు వేసే వరకు విధిగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, పిఎల్‌ఏలు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.