ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీరో పి _4” కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం అమృతలూరు గ్రామంలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ సభ్యులు నక్కా ఆనంద బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనే మహత్తర లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.