ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించండి

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో ఆదివారం జరిగిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళి కృష్ణ ప్రారంభించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్