కొల్లూరు మండలం పెసరలంక గ్రామంలో మంగళవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను 60 శాతం పూర్తి చేసామని పేర్కొన్నారు.