ఎన్టీఆర్ పెన్షన్ తో పేదలకు భరోసా ఎమ్మెల్యే ఆనంద్ బాబు

వేమూరు నియోజకవర్గం, అమృతలూరు మండలం, యడవూరు గ్రామంలోని ఎస్సీ బీసీ కాలనీలలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరుతున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్