గురువారం భట్టిప్రోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎంపీడీవో కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా 14 మంది లబ్ధిదారులకు మొత్తం 4,69,006 లక్షల ఆర్థిక సహాయం అందజేయబడింది. సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే ఆనంద్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.