జంపనిలో ఇంటింటికివెళ్లి అభివృద్ధి పథకాలు వివరించిన ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమము లో వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.
జంపని గ్రామం లోని ఇంటి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకొని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలియజేసారు. ప్రతిరోజు 30 గృహాలను సందర్శించాలన్నారు.

సంబంధిత పోస్ట్