తిరుమలలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే

సోమవారం అమర్తలూరు మండలం తురుమెళ్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి (రైతన్నల పండుగ) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూములకు, నాగళ్లకు, ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రైతులతో కలిసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, 'ఏరువాక సాగాలి. ఎడ్ల జతలు కదలాలి. పంటపొలాలు పచ్చగా ఉండాలి. అన్నదాత ఇంట సిరులు కురవాలి' అని రైతులకు ఏరువాక పౌర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్