వేమూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముగ్గురు లబ్ధిదారులకు రూ. 4,88,327 లక్షల వైద్య ఆర్థిక సహాయం అందజేయబడింది. బుధవారం వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు తన క్యాంపు కార్యాలయంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేద మరియు ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని, దీనిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు.