ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఐదుగురు అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. గురువారం ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ.1,52,087 రూపాయల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే ఆనందబాబు అందజేశారు.